సామర్థ్యాలను పెంపొందించుకోవాలి


Thu,December 12, 2019 01:47 AM

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : ఇంటర్‌ విద్యార్థులు వారి సామర్థ్యాలను పెంచుకున్నట్లయితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఇంటర్‌ విద్యార్థుల మానసిక కౌన్సెలర్‌ భగవేణి నర్సింహులు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థులకు వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, వైఖరి, మానసిక ఉల్లాసం సామర్థ్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులు మానసిక వేదనతో 30 మంది వరకు మృతి చెందడం పట్ల ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు కౌన్సిలర్లను ప్రభుత్వం నియమించి వారితో విద్యార్థినులకు వికాస శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సెల్ఫ్‌ డిఫెన్స్‌పై శిక్షణ ఇచ్చారు. స్టూడెంట్స్‌ అట్రాక్షన్‌, బాడీ ల్యాంగ్వేజీ, ఎవాల్యూషన్‌, కోచింగ్‌ మెథడ్‌, లెక్చర్‌ మెథడ్‌, పోటీ తత్వం, స్ట్రెస్‌(ఒత్తిడి), ఆత్మవిశ్వాసంపై, నూతిక విలువలపై విద్యార్థులతో ప్రదర్శన రూపకంగా అవగాహన కల్పించి పోటీ పరీక్షలను ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. మానసికోల్లాసంకు మెడిటేసన్‌, వ్యాయామం చేయాలన్నారు. మరణం అన్నింటికీ పరిష్కారం కాదని, ఆటుపోట్లతో జీవితాన్ని అధిగమించాలన్నారు. ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్‌ విద్యాధికారి వెంకటరమణ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవిప్రకాశ్‌, వెంకట్‌రెడ్డి, యూసూఫ్‌, మధు, వసంత్‌, రాజయ్య, కిరణ్‌, నర్సింహారావు, ప్రభాకరాచారి, హరిత, అంజనీబాయి, స్వాతి, పరమేశ్వరీ, అరుంధతి, శిరీష, టస్కిన్‌, విద్యార్థులు, పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...