టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆగిన పాలమూరు జిల్లా రైతుల వలసలు


Sun,December 8, 2019 11:56 PM

వంగూరు : రాష్ట్రంలోనే వల్లసల జిల్లాగా పేరు గాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా రూపు రేఖలను మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఎంపీపీ భీమమ్మ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోప్రభుత్వ విప్‌ మాట్లాడారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు ఎన్నడూ ఉమ్మడి పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని అన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు.

గతంలో పాలించిన పాలకులు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి వలసలను నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సాగునీరు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణమ్మతో సశ్యశామలం చేయడం జరిగిందన్నారు. దేశంలోనే ఏరాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హాయంలో వంగూరు మండలానికి 3వేల ఎకరాలకు డిజైన్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. రైతు బందు, రైతు బీమా, నిరంతర విద్యుత్తు అందిస్తుందన్నారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు హమీద్‌, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు గణేశ్‌రావు, యాదవసంఘం జిల్లా అధ్యక్షుడు లాలుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...