‘ఉపాధ్యాయుల హక్కులపై యూటీఎఫ్‌ రాజీలేని పోరాటం’


Thu,December 5, 2019 02:02 AM

చారకొండ: ఉపాధ్యాయుల హక్కుల సాధనకై యూటీఎఫ్‌ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ జిల్లా కార్యదర్శి చిన్నయ్య అన్నారు. బుధవారం తుర్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలల్లో యూటీఎఫ్‌ మండల మహాసభ నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో 12వేల బడులను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కేజీ నుంచి ఇంగ్లిషు మీడియం తరగతులను ప్రారంభించాలని అన్నా సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని అన్నారు.

పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నేనావత్‌ మహిపాల్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్‌గౌడ్‌, కోశాధికారిగా తిరుపతినాయక్‌, గౌరవ అధ్యక్షుడిగా అంజయ్య, సలహాదారుడిగా కోట్య, అసోసియేట్‌ అధ్యక్షుడు రవీందర్‌, మహిళా ఉపాధ్యక్షురాలు మాదవి, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి, మహిళ కన్వీనర్‌ రాజ్యలక్ష్మి, కో-కన్వీనర్‌ మాలతలతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...