దళారుల చేతుల్లో మోసపోతున్న రైతన్నలు


Thu,December 5, 2019 02:01 AM

-తూకంలో 2.35 క్వింటాళ్ల తరుగు
-కాంటా మోసాలపై ఆందోళనలు
-మార్కెటింగ్‌ అధికారులు

చారకొండ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు, క్రిమిసంహకార మందులు, ఎరువును అధిక ధరలను విక్రయించి మోసం చేయడం ఒక ఎత్తయితే పండించిన పంటను అమ్ముకుందామని చూస్తే ధరలో, తూకంలో దళారులు మోసం చేస్తూ అమ్మాయక అన్నదాతలను దళారులు మోసం చేస్తున్నారు. బుధవారం చారకొండ మండల కేంద్రానికి చెందిన రైతు అశోక్‌ తన పత్తి పంటను తూకం వేయడానికి రామలక్ష్మణ వేబ్రిడ్జి వద్దకు తీసుకురాగా లారీ బరువు 10755 కేజీలు రాగా రైతుకు అనుమానం రావడంతో వేరే వేబ్రిడ్జిలో తూకం వేయగా బరువు 10990 వచ్చింది. రైతుకు తూకంలో 2.35 క్విం తరుగు వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురై పత్తి వ్యాపారుల దుకాణాలకు తాళాలు వేసి రోడ్డుపై రాస్తారోకోకు దిగ్గారు. పత్తి దళారులపై మార్కెటింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు.

చాలా రోజుల నుంచి వేబ్రిడ్జిలో మోసాలు జరిగాయని పత్తి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగే చర్యలు తీసుకుంటామని చారకొండ సర్పంచ్‌ విజేందర్‌గౌడ్‌ తెలిపారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడి వేబ్రిడ్జిపై వేసిన పత్తికి క్వింటాల్‌కు 3కిలోల చొప్పున అదనంగా డబ్బులు రైతులకు చెల్లించాలని, వేబ్రిడ్జి కాంటా గ్రామ పంచాయతీ అదీనం చేసుకుంటుందని నిర్ణయించడంతో రైతులు ఆందోళనలు విరమించారు.

ఏలాంటి సంఘటనలు జరగకుండా చారకొండ, వంగూరు ఎస్సైలు కృష్ణదేవా, బాలకృష్ణ బందోబస్తు నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాణినరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మయ్య, రైతు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు గురువయ్యగౌడ్‌, కృష్ణయ్య, కమలాకర్‌రావు, జంగయ్య, జగన్‌, శ్రీను, అశోక్‌, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...