అడవుల పరిరక్షణకు సహకరించాలి


Thu,December 5, 2019 02:00 AM

-సివిల్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి భవాని
అచ్చంపేట రూరల్‌ : అడవులు, పర్యావరణ పరిరక్షణకు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు సివిల్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి భవాని తెలిపారు. బుధవారం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. అడవులు, అటవీ జంతువులను కాపాడుట, ప్లాస్టిక్‌ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సివిల్‌ కోర్టు, పోలీసుశాఖ, జెన్ని ట్రస్టుల పల్కపల్లి రోడ్డు సమీపంలోని బాలుర గురుకుల విద్యాలయంలో ఈ నెల 21న నిర్వహించనున్న కార్యక్రమంలో అడవుల రక్షణ, పర్యావరణం కాపాడుట సమాజంలో చట్టాల ప్రాముఖ్యత, చెంచులు వారి జీవన విధానం పై రచనలను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి పై రచనలు పంపాలనుకునే రచయితలు web\\ savenallama కు పంపించాలని సూచించారు.


రచనలను తెలుగు, హిందీ, ఆంగ్లం భాషలలో పంపించవచ్చన్నారు. పాఠశాలలో విద్యార్థులచే పర్యావరణం పై వివిధ రకాలైన ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ఉపన్యాస పోటీలకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ పురుశోత్తంరెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి కోర్టుల న్యాయవాధులు, పోలీస్‌ అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...