అంతర్జాతీయ ప్రమాణాలతో..వేరుశనగ పరిశోధన కేంద్రం


Thu,December 5, 2019 02:00 AM

-30 క్వింటాళ్ల సాధించేలా ప్రభుత్వం కృషి
-వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డివేరుశనగ కే6 బ్రీడసాగు క్షేత్రం పరిశీలన

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాతీయ స్థాయిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్ద ఉన్నాయని మంత్రి చెప్పారు.

కల్వకుర్తి పట్టణ సమీపంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సహకార సంస్థ ఆధ్వర్యంలో రైతు బోజిరెడ్డి సాగుచేసిన వేరుశనగ కే6 బ్రీడర్‌ సాగు క్షేత్రాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌,తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, డైరెక్టర్‌ కేశవులు, నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌లతో కలిసి బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్‌లో అయిల్‌ సీడ్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, అందులో అంతర్జాతీయ మార్కెట్‌లో వేరుశనగకు చాల మంచి మార్కెట్‌ ఉందని అన్నారు.

ఇతర నూనే గింజలతో పోలిస్తే వేరుశనగ చాల నాణ్యమైనదే కాకుండా శ్రేష్టమైనదని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక వేరుశనగ దిగుబడి సాగిస్తున్నది ఉమ్మడి పాలమూరు జిల్లా అని, అందులో వనపర్తి జిల్లాది అగ్రస్థానమని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఫంగస్‌ లేని వేరుశనగకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉందని, అప్లాటాక్సిన్‌ ఫంగస్‌లేని వేరుశనగ మన ప్రాంతంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్న వేరుశనగను 25 క్వింటాళ్ల 30 క్వింటాళ్ల వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి వివరించారు.

నెదర్లాండ్‌ అనుభవాలను వివరించిన మంత్రి..
నెదర్లాండ్‌ పర్యటన వివరాలను మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.ప్రపంచంలో అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలతో, సౌష్టవంతో నెదర్లాండ్‌ ప్రజలు ఉంటారని, ఇందుకు ప్రధాన కారణం వారు వేరుశనగ ఉత్పత్తులను అధికంగా వినియోగించడమేనని మంత్రి వివరించారు. ఆప్లాటాక్సిన్‌ ఫంగస్‌ లేని వేరుశనగ పంటలు పండుతామని, వేరుశనగ నుంచి వచ్చే పీనట్‌ బట్టర్‌ను అక్కడి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారని మంత్రి చెప్పారు.
బంతి పూలతోటను పరిశీలించిన మంత్రి..
బోజిరెడ్డి వ్యవసాయ పొలంలో బంతిపూల తోటను మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఇంత వరకు ఎంత దిగుబడి వచ్చిందని రైతును మంత్రి అడిగారు. పూల తోటల వల్ల కూడా చాల లాభం ఉంటుందని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు.

మంత్రి నిరంజన్‌రెడ్డికి ఘన స్వాగతం..
వ్యవసాయ క్షేత్రంలో వేరుశనగ విత్తన పంటను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డికి వ్యవసాయాధికారులు, రైతులు టీఆర్‌ఎస్‌ నాయకులు స్వా పలికారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానం చేశారు. రైతులు వినతులు ఇచ్చారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శ్రీశైలం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, కల్వకుర్తి, వెల్ధండ మండలాల అధ్యక్షుడు విజయ్‌గౌడ్‌, సంజీవ్‌, సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు నాయకులు సూర్యప్రకాశ్‌రావు, భాస్కర్‌రెడ్డి, భగత్‌సింగ్‌, శ్రీకాంత్‌, పర్వతాలు పలువురు రైతులు పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...