ఉరే..సరి..


Sun,December 1, 2019 02:25 AM

-నిందితులని కఠినంగా శిక్షించాలి..
-దుర్మార్గులను వెంటనే ఉరి తీయాలంటూ ర్యాలీలు
-శంషాబాద్ ఘటనపై జిల్లావ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు
-జ్ఞాపకార్థంగా అచ్చంపేట స్మృతివనంలో మొక్క నాటిన విప్ గువ్వల దంపతులు
బహిరంగంగా ఉరితీయాలి
కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్న మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలని, అందుకు అనువైన విధంగా చట్టాలను సవరించాలని కల్వకుర్తి రెడ్డి సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రెడ్డి సేవా సమితి నాయకులు మాట్లాడుతూ శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంకాడ్డి, వరంగల్‌లో మాసన, తాసిల్దార్ విజయాడ్డి ఉదంతాలను పాలమూరు రెడ్డి సేవా సమితీ తీవ్ర స్థాయిలో ఖండిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్షికమంలో రెడ్డి సేవా సమితి నాయకులు పసుల శేఖర్‌డ్డి, బొజ్జ కిష్టాడ్డి, యాదగిరిడ్డి, అల్వాల్‌డ్డి, సుధాకర్‌డ్డి, కుడుముల శేఖర్‌డ్డి పాల్గొన్నారు.

విద్యార్థుల ర్యాలీ
కల్వకుర్తి రూరల్: పశువైద్యురాలిపై లైంగికదాడిచేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కల్వకుర్తి న్యూఎరా కళాశాల విద్యార్థులు ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. కల్వకుర్తి పట్టణంలోని తమ కళాశాల నుంచి ఆమె హత్యను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్షికమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యం, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు.
దుర్మార్గులను ఉరితీయాలి

వెల్దండ: శంషాబాద్ హత్య ఘటనలో నిందితులను వెంటనే ఉరితీయాలని వెల్దండ మండల పశువైద్యాధికారి దేవిడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వెల్దండ మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో ఆమె మృతికి నివాళులర్పించి, మౌనం పా టించారు. కార్యక్షికమంలో సిబ్బంది నరేశ్‌డ్డి, నర్సింహ, శ్రీను, మొగులయ్య, సాయిబాబు ఉన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శన
అమ్రాబాద్: శంషాబాద్ లైంగికదాడి ఘటనను నిరసిస్తూ అమ్రాబాద్ మండలకేంవూదంలో గల అంబేద్కర్ చౌరస్తాలో మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్షికమంలో మహిళలు కృష్ణమ్మ, సాయిలమ్మ, సుగుణమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

విద్యార్థుల శ్రద్ధాంజలి
కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: షాద్‌నగర్ వద్ద దారుణ హత్యకు గురైన వైద్యురాలు కొల్లాపూర్ పట్టణంలోని సెయింట్‌మేరీ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. పూర్వ విద్యార్థిని హత్య పట్ల పాఠశాల విద్యార్థులు పట్టణంలో శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్నప్పుడు చదువుల్లో ముందంజలో ఉండేదని రాష్ట్రం ఒక డాక్టర్‌ను కోల్పోవడం బాధాకరమని అన్నారు.

అచ్చంపేటలో..
అచ్చంపేట, నమస్తే తెలంగాణ: వరంగల్, శంషాబాద్ ఘటనల్లో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ అచ్చంపేటలో రెడ్డిసేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. కార్యక్షికమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసి రామకృష్ణాడ్డి, కౌన్సిలర్ శైలజడ్డి, ఎంపీపీ అరుణాడ్డి, సీఎండ్డి మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

పదరలో..
పదర: శంషాబాద్ ఘటనలో మృతిచెందిన వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పదరలో వివిధ యువజన సంఘలు వివిధ పార్టీ నాయకులు విద్యావంతులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్షికమంలో ఎంపీటీసీ సునిత శ్రీను, విద్యా కమిటీ చైర్మన్ పుణ్యమూర్తి నారయ్య యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాలి
నాగర్‌కర్నూల్‌టౌన్/తిమ్మాజిపేట/తెలకపల్లి : పశువైద్యురాలిపై లైంగికదాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ప్రభుత్వ పూర్తి చర్యలు తీసుకోవాలని, నిందితుల తరుపున ఎలాంటి వాదనలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో ప్రజావూపతినిధులు, స్థానికులు, మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలకపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్షికమంలో గీత, అశోక్, సాయికుమార్, పవన్, నరేందర్, లక్ష్మీప్రియ, లింగమ్మ , మాజీ సర్పంచ్ కవిత, టీఆర్‌ఎస్ నాయకులు ప్రదీప్, లింగం, వెంక ప్రశాంత్, శేఖర్, విష్ణు, బాలరాజు,కరుణాకర్‌డ్డి, రాజవర్దన్‌డ్డి, అరుణ్‌కుమార్‌డ్డి, సతీష్‌డ్డి, వంశీదర్‌డ్డిలు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...