రాములోరి సాక్షిగా..సురభిరాజా ప్రమాణం చేయాలి


Sun,November 17, 2019 01:46 AM

-బంగ్లా ముందు స్థలాన్ని నేను రూ.2కోట్లకు అడిగింది అసత్యం
-నిజమైతే బహిరంగ చర్చావేదికలో ఒప్పుకోవాలి
-టీఆర్‌ఎస్ శ్రేణులతో ర్యాలీగా రామమందిరానికి..
-ఆలయంలో 2గంటల పాటు నిరీక్షించిన మాజీ మంత్రి జూపల్లి

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: కొల్లాపూర్ పట్టణంలో రాజా ప్యాలెస్ ముందున్న ఖాళీ స్థలాన్ని తనకు రూ. అమ్మమని అడిగితే కాదన్నందుకే తమ మధ్య గొడవలు మొదలైనట్లు కొల్లాపూర్ సంస్థానాదీశుల వారసుడు సురభి బాలాదిత్య లకా్ష్మరావు చేసిన ఆరోపణలు నిజమైతే బహిరంగ చర్చావేదికకు రావాలని మాజీమంత్రి జూపల్లికృష్ణారావు సవాల్ విసిరారు. లకా్ష్మరావు చేసిన అసత్యారోపణలపై బహిరంగ చర్చవేదికలో నిగ్గుతేల్చుకుందామని జూపల్లి విసిరిన సవాల్ ప్రకారంగానే శనివారం ఉదయం 11-30గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా పట్టణంలోని రామాలయానికి జూపల్లి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు లకా్ష్మరావు రాక కోసం నిరీక్షించి అనంతరం ఆయన మాట్లాడారు. తనపై లకా్ష్మరావు దుర్మార్గమైన ఆరోపణలు చేయడం తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం పట్ల అసహనం వ్యక్తం ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్య చేస్తున్నారని విమర్శించారు.

ఈరోజు బహిరంగ చర్చావేదికకు రాలేకపోయినా ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రాజా వారి రాకకోసం వేచిఉంటానని జూపల్లి స్పష్టం చేశారు. ఆదివారం కూడా ఈ బహిరంగ చర్చావేదికకు సురభి బాలాదిత్య లకా్ష్మరావు రాకపోతే అన్నీ విషయాలపై తాను మాట్లాడుతానన్నారు. బంగ్లా వెనుకాల ఉన్న ఖాళీ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనీయకుండగా ప్రజాఉపయోగాల కోసం వినియోగానికి ఉంటుందని ఉంచితే..20 రోజుల క్రితం ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చాడని, ఈయన ఎందుకిచ్చాడో..ఎవ్వరి వత్తిళ్లున్నాయోనని జూపల్లి పేర్కొన్నారు. దీనిపై రేపు సుదీర్ఘంగా ఎన్టీఆర్ చౌరస్తాలో మాట్లాడుకుందామని ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు హన్మంత్ నాయక్, కేతేపల్లిరవి, కోడేరు ఎంపీపీ కొండరాధమ్మ, మాజీ ఎంపీపీ చిన్ననిరంజన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఎగ్బాల్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పిన్నంశెట్టి బాలు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు సిబ్బేదినర్సింహారావు, పస్పుల నర్సింహ, గుమ్మకొండ రమేశ్, రహీం, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles