మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో రాజీ వద్దు


Sun,November 17, 2019 01:42 AM

కోస్గి : మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో రాజీ పడవద్దని రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి మున్సిపల్ కమిషనర్లను ఆదేశిం చారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరాలను సేకరించారు. అయితే కోస్గి మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల వివరాలను మున్సిపల్ కమిషనర్ జాన్ శామ్యూల్ రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్లకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డంపింగ్ యా ర్డుల ఏర్పాటులో స్థానికుల అభ్యంతరాలను సిబ్బంది ప్రస్తావించడంతో వారితో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో పారిశుధ్య చర్యలు నిర్వహించాలని, ముఖ్యం గా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి అందుకు తగ్గట్లు ప్రత్యేక తీసుకోవాలని, ఇదే సందర్భంలో ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ సిబ్బంది నరేశ్‌యాదవ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...