విలేకరులకు ఘన సన్మానం


Sun,November 17, 2019 01:41 AM

ధన్వాడ : సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను వెలుగులోకి తెస్తు విలేకర్లు రాసే కొన్ని వార్తలు కనువిప్పు కల్గిస్తున్నాయని జిల్లా విద్యాధికారి రవీందర్ అన్నారు. ధన్వాడ బాలు ర ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతీయ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట, ధన్వాడ, దామరిగిద్ద, మరికల్ మండలాల విలేకర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈ వో మాట్లాడుతూ కత్తి కన్నా కలం గొప్పదన్నారు. అనంతరం విలేకర్లను శాలువాలలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జీహెచ్‌ఎం రమేశ్‌శెట్టి, ఎంపీపీ పద్మిబాయి, జెడ్పీటీసీ విమల, ఎంపీటీసీలు ఉమేష్‌కూమార్, జట్రం గోవర్ధన్‌గౌడ్, మాధవి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఊసు రవికుమార్, చంద్రయ్య, శ్రీనివాస్‌సాగర్, జీహెచ్‌ఎం విజయలక్ష్మి, తాటి నర్సప్ప పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...