పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : డీఈవో


Sun,November 17, 2019 01:41 AM

నర్వ : మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని జిల్లా విద్యాధికారి రవీందర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఉందెకోడ్‌లోని జెడ్పీహెచ్‌ఎస్, యూపీఏస్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ట్యాంకు నుంచి నీరు వృథాగా పోవడడంతోపాటు గుంతలో నిల్వ ఉన్న నీటిలో దోమలు ఉండడాన్ని చూసిన ఆయన హెచ్‌ఎం తిరుపతయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని హెచ్‌ఎంను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి మండల కేంద్రాన్ని చేరుకున్న ఆయన ఎమ్మార్సీ హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించి పది ఫలితాలపై చర్చించారు.

అనంతరం డీఈవో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చొకుండా ప్రత్నామ్నాయ్య ఏర్పాట్లు చేయాలని, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, మధ్యాహ్నం భోజనంను నాణ్యతగా అం దించేందుకు హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా మండలానికి వచ్చిన డీఈవో రవీందర్‌ను మండల పీఆర్టీయూ నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కలెక్టర్‌ను సన్మానించిన వారిలో ఎంఈవో లక్ష్మీనారాయణ, పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...