చట్టాలపై విద్యార్థులకు అవగాహన


Sun,November 17, 2019 01:40 AM

నారాయణపేట టౌన్ : పట్టణ శివారులోని ద్వారకా సెంట్రల్ స్కూల్‌లో మండల్ లెవల్ సర్వీసెస్ కమిటీ నారాయణపేట వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి శుభవల్లి హాజరై మాట్లాడారు. చైల్డ్ లేబర్ యాక్టు, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ఎడ్యుకేషన్ తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, సతీశ్, సత్యనారాయణ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...