అదేజోరు.. అదేజోరు..


Sat,November 16, 2019 12:29 AM

-సాఫీగా సాగుతున్న ప్రయాణాలు
-గమ్యస్థానానికి లక్షా 50 మంది..
-141 ఆర్టీసీ బస్సులు, 74 హైర్ బస్సులు
-టూరిస్టులు 7, ట్యాక్సీలు 250
-355 ప్రైవేట్ జీపులు, ఆటోలతో సాగిన ప్రయాణం

నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం జోరుగా సాగుతుంది. జిల్లాలో ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని బస్సులతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నడిపిస్తుండడంతో ప్రయాణికుల సంఖ్యకూడా పెరుగుతూ వస్తుంది. శుక్రవారం ఏకంగా 1 లక్షా 50 వేల మంది ప్రయాణం కొనసాగింది. ఆర్టీసీ, ప్రైవేట్, జీపులు, ఆటోలు, ట్యాక్సీ 827 వాహనాలు నడవగా రవాణా ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోని రవాణా వ్యవస్థ మెరుగ్గా కనిపిస్తోంది. గురు, శుక్రవారం మరింత రవాణా పెరిగి అత్యధికంగా 1 లక్షా 50 వేల మందికిపైగా ప్రయాణికులు ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరారు. కార్మికులు సమ్మె బాటపట్టి నాలుగు పదులకు మించినా వీడకపోవడంతోపాటు నిరవధిక దీక్షలను కొనసాగిస్తున్నారు.

నాలుగు డిపోల పరిధిలో 141 ఆర్టీసీ బస్సులు, 74 హెయిర్ బస్సులు, 250 ట్యాక్సీలు, 7 టూరిస్టులు నడిపించారు. మొత్తానికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ఆర్టీసీ అధికారులు. కాగా కార్మికులు శుక్రవారం హౌజింగ్‌బోర్డులోని రెబల్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమానికి నిర్వహించారు. కార్మికులకు సంఘీభావంగా వంటచేసిపెట్టినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఇదిలావుండగా రోజు మాదిరిగానే గాంధీపార్కులో నిరవధిక దీక్షలను యథావిధిగా కొనసాగించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...