ఉమామహేశ్వర క్షేత్రంలో జడ్జి పూజలు


Sat,November 16, 2019 12:26 AM

అచ్చంపేట రూరల్ : శ్రీశైల ఉత్తర ధ్వారమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రాన్ని అచ్చంపేట సివిల్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి (జడ్జి) భవాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమాభిషేకం, ఉమామహేశ్వరుడికి అభిషేకం నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది రామకృష్ణ, లక్ష్మయ్య, పర్వతాలు, శంకర్, ఊమ్లా, రమేశ్ ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles