భూప్రక్షాళనలో పొరపాట్లకు తావివ్వొద్దు


Sat,November 16, 2019 12:26 AM

నాగర్‌కర్నూల్ టౌన్: ప్రస్తుతం జరుగుతున్న భూప్రక్షాళనలో భాగంగా ఎలాంటి పొరపాట్లకు తావు ప్రక్షాళన జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. శుక్రవారం జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల వెరిఫికేషన్, భూప్రక్షాళనపై సమావేశం నిర్వహించారు. ప్రక్షాళనలో భాగంగా ప్యూరిఫికేఏషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డు పొరపాట్లకు తావు లేకుండా భూరికార్డుల ప్రక్షాళన నిర్వహించాలన్నారు. జిల్లాలోని భూమి రికార్డుల కార్యక్రమాన్ని సమర్ధవంతంగా పూర్తి చేసి రెవెన్యూశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు.

తప్పులకు ఆస్కారం లేకుండా భూరికార్డులను ప్రక్షాళన చేయాలని రికార్డులు స్వచ్ఛీకరించేటప్పుడు తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే మార్పులు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాలను తాసిల్దార్లు వెంటనే పూర్తి చేయాలని, పూర్తయిన పాస్‌పుస్తకాలను వెంటనే రైతులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పొప్పులను సరి విషయాలను ఓటర్లకు ప్రత్యక్షంగా తెలియజేయాలన్నారు. ఓటర్ల పరిశీలనకు ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఎక్కువగా వినియోగించుకునేలా బీఎల్‌వోలను, ఓటర్లను, చైతన్య ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్, ఆర్డీవోలు, తాసిల్దార్లు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles