మీకు అన్యాయం జరగనివ్వం


Sat,November 16, 2019 12:26 AM

బిజినేపల్లి : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మించబోయే వెంకటాద్రి రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వనని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టెం సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద అనకాన్‌పల్లి, అనకాన్‌పల్లితండా, కార్కొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండాలకు సంబంధించిన ముంపు బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మల్లన్నసాగర్ మాదిరిగానే ఇండ్లు కోల్పొయిన వారికి పరిహారం ఇవ్వడం జరుగుతుందని, వాటికి సంబంధించి 53కోట్ల 23,038 రూపాయలు మంజూరయ్యాయన్నారు.

15 రోజుల్లో ప్రతి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. 397 కుటుంబాలకు గాను 250 గజాల పొలంతో పాటు 5లక్షల రూపాయాలను కూడా మంజూరు చేయడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా రూ.7.50లక్షలు అందజేయడంతో పాటు 250 గజాల భూమి అందించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి 70-80 గజాలు ఇవ్వాల్సి ఉండగా 250 గజాలను ఇస్తున్నామన్నారు.. త్వరలోనే ప్రభుత్వ భూమిని గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయిస్తారన్నారు. తాను సొంతంగా ప్రతి కుటుంబానికి రూ.5లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు డబుల్ కూడా నిర్మించి ఇస్తామన్నారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటస్వామి, పులెందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాములునాయక్, లక్ష్మణ్, పాండు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...