మరో కాణిపాకంగా ఆవంచ ఎమ్మెల్యేలు..లకా్ష్మరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి


Fri,November 15, 2019 03:41 AM

తిమ్మాజిపేట : తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులు కాణిపాకం వినాయకున్ని ఎలా దర్శించుకుంటారో...భవిష్యత్‌లో యాదాద్రి నర్సింహాస్వామి దర్శనం అనంతరం ఆవంచ ఏకాశీలా ఐశ్వర్య గణపతిని దర్శించుకునేలా ఇక్కడ మందిరాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డిలు అన్నారు. గురువారం మండలంలోని ఆవంచ గ్రామంలో రూ.75 లక్షలతో నిర్మించనున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి వారు పూజలను నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 30 అడుగుల ఏకాశీలా గణపతి ఆవంచలో ఉందని, ఇక్కడ ఆలయాన్ని తామిద్దరం కలిసి నిర్మిస్తామన్నారు. ఇప్పటికే ఒక ట్రస్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చిందని, రెండు మూడు నెలలలో ఆలయా నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు.

గ్రామంలో రెండు ఆంజనేయ స్వామి ఆలయాలను పునరుద్ధరిస్తామన్నారు. దశల వారీగా గ్రామంలో ఉన్న మందిరాలను సర్వంగాసుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు యువకులు, పెద్దలు ముందుకురావాలన్నారు. వేంకటేశ్వర ఆలయానికి తానే నిధులు సమకూర్చుతానని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా యాదాద్రి వేదపండితుల మంతోచ్చరణల మధ్య ఆలయానికి భూమి పూజ చేశారు. వేదపండితులు ఎమ్మెల్యేలకు యాదాద్రి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక సంస్థ చైర్మన్ శివకుమార్,మహబుబ్‌నగర్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్,గ్రామ సర్పంచ్ ఆజయ్‌కుమార్, శారద, తదితరులు

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...