సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వాల చేయూత అవసరం


Fri,November 15, 2019 03:40 AM

వెల్దండ:సహకార సంఘాల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరమని ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. ముద్ర సొసైటీ చైర్మన్ రామదాసప్పనాయుడు ఆదేశాల మేరకు గురువారం వెల్దండ మండల కేంద్రంలోని ముద్ర సొసైటీ వద్ద సహకార దినోత్సవం పురష్కరించుకొని జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి సహకార సంఘాలే నేడు జాతీయ బ్యాంకులుగా విస్తరణ చెందాయన్నారు. సహకార సంఘాల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేయూత ఎంతో అవసరమన్నారు.

రామదాసప్పనాయుడు ఆధ్వర్యంలో నేడు తెలంగాణ , ఆంధ్ర రాష్ర్టాల్లో 150 బ్రాంచ్‌ల ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 1500 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు ఋణాలు అందిస్తూ వారి ఉపాధికి తోడ్పాటునందిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ న్యాయ సలహదారు రవికుమార్, ఆర్‌ఎం శేఖర్‌గౌడ్, స్టాప్ అకౌంటెంట్ క్రాంతికుమార్, ఉదయ్, బీఏం ఆంజనేయులుగౌడ్ సిబ్బంది నరసింహ, రవీందర్, సురేశ్, నాగార్జున్, జాహంగీర్, కర్ణాకర్‌గౌడ్, జాహంగీర్ తదితరులు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles