ఎస్‌ఎల్‌బీసీ పనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరా


Wed,November 13, 2019 02:44 AM

అమ్రాబాద్‌ రూరల్‌ : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు సొరంగ పను లు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితులపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆరాతీశారు. తాను కుటంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను దైవదర్శణం చేసుకొని తిరుగు ప్రాయణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద జరుగుతున్న సొరంగ పనులపై చేపడుతున్న జేపీ కంపెనీ అసొసియెట్‌ అధికారి లోకనాథ్‌ కల్నల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన మంత్రికి ఎస్‌ఎల్‌బీసీ పనుల గురించి మంత్రికి వివరిస్తు ప్రస్తుతం సొరంగ పనులు నిలిచిపోయాని, సొరంగం అంతర్భాగంలో నీరు చేరడంతో పనులకు ఇబ్బందులు కలుగుతుందని దీంతో పనులను నిలిపివేశామని మంత్రికి చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు వైపు నుంచి 16 కి.మీ, అచ్చంపేట మండలం మన్యవారిపల్లి వైపు నుంచి 18 కి.మీ వరకు సొరంగం పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. పనులు మరింత వేగంగా జరిగే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తాన్నాని మంత్రి తెలిపారు. మంత్రి వెంట జెన్‌కో అధికారులు, నీటి పారుదలశాఖ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు శివారెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ ప్రసాద్‌ ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...