సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి


Tue,November 12, 2019 03:49 AM

-జేసీ శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను ప్ర జావాణి ద్వారా ఫిర్యాదులు అందిస్తే వాటికి వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంత కా లమైనా ప్రతి సోమవారం ఎప్పటి మాదిరిగానే ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యలు పెరుగు తున్నాయే కానీ తగ్గడం లేదన్నారు. ప్రతి జిల్లా అధికారి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించి సంబంధిత మండల అధికారుల ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వచ్చిన 77ఫిర్యాదులను జేసీ, డీఆర్‌వో మధుసూదన్ నా యక్‌లు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...