ప్రయాణం ప్రశాంతం


Tue,November 12, 2019 03:49 AM


నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లాలో ప్రయాణ వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగుతుంది. తాత్కాళిక సిబ్బందితో జిల్లాలోని నా లుగు డిపోల పరిధిలో అన్ని బస్సులను నడిపించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రోజురోజుకు రవాణా వ్యవస్థ మెరుగు పడడంతో అత్యధికంగా ప్రయాణికులు గమ్యానికి చేరుతున్నారు. సోమవారం అత్యధికంగా లక్షకుపైగా ప్ర యాణికులను గ మ్యానికి చేర్చారు. కార్మికుల సమ్మెబాట వీడకపోయినా తా త్కాళిక ఉద్యోగులతో బస్సులను నడిపిస్తున్నారు అధికారులు. ప్ర యాణికులను యథేచ్చగా గమ్యానికి చేరుస్తున్నారు. 38 రోజులు సమ్మె చేరుకున్న సందర్భంగా సోమవారం కార్మికులు కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేట్, ఇతర జీపులు, ఆటోలు, క్యాబ్‌లు మొత్తం 902 వాహనాలు జిల్లాలో నడవగా దాదాపు 1 లక్షా 10 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 137 ఆర్టీసీ బస్సులు, 78 హెయిర్ బస్సులు, 285 ట్యాక్సీలు, 7 టూరిస్టులు నడిపించారు. మొత్తానికి 1 లక్షలకుపైగా ప్రయాణికులను రవాణా కొనసాగింది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...