సిరిధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం


Tue,November 12, 2019 03:48 AM

-డాక్టర్ ఖాదర్‌వలి వెల్లడి
కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: సిరిధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని డాక్టర్ ఖాద ర్‌వలి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంజీకేఎల్‌ఐ గెస్ట్‌హౌస్‌లో రైతులోకం పౌండర్ రాష్ట్ర అధ్యక్షుడు, పాలమూరు ప్రభుత్వ జనరల్ సివిల్ దవాఖాన సూపరింటెండెంట్, ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నేడు రైతులు పండిస్తున్న పంటలు విషపూరితమైనవని, వీటిని మనం తినడం మూలంగా అనార్యోగానికి గురవుతున్నట్లు ఖాదర్‌వలి పేర్కొన్నారు. ఫర్టిలైజర్ ఎరువులతో సాగుచేయకుండా పాతకాలపు నాటి సేద్యమైన సేంద్రియ ఎరువులతో సాగుచేసుకోవడంతో మనకు ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. ఫర్టిలైజర్ ఎరువులతో సేద్యం చేయడంతో పండిన పంటతో పాటు భూమికూడా నిస్సారమవుతుందన్నారు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం సాగు చేసుకోవడం మూలంగా సాగు పెట్టుబడి తగ్గడం, పైగా దిగుబడి కూడా ఆశించినస్థాయిలో పొందవచ్చన్నారు. ప్రస్తుతం విషతుల్యమైన ఆహారం తీసుకోవడంతో అనేక రోగాలకు గురవుతున్నట్లు డాక్టర్ ఖాదర్‌వలి స్పష్టం చేశారు.

సేంద్రియ ఎరువులతో పండించిన చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో ఆధునిక రోగాలు సైతం ధరిచేరనీయవ్వని ఆయన స్పష్టం చేశారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలను పండించేందుకు గాను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రైతులకు అవగహనకల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత దేశంలోనే సేంద్రియ వ్యవసాయంతో చిరుధాన్యాలను పండించడంలో కర్ణాటక రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతాల రైతులకు రసాయన ఎరువులు వాడకుండా పాతకాలపు నాటి పేడ ఎరువులతో చిరుధాన్యాలను సాగుచేయడంతో మార్కెట్‌లో నేడు ధరల డిమాండ్ కూడా ఉందన్నారు. అందుకోసం రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులను వినియోగించి పాతకాలపు సేద్యం వైపు రైతులు తమ దృష్టిని మళ్లించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సమావేశంలో రైతు లోకం నాయకులు విజయ్,నవీన్ ఉన్నారు. అనంతరం సిరిధాన్యాల సాగుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు విడుదల చేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...