హోరాహోరీ


Mon,November 11, 2019 02:20 AM

-ముగిసిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
-విజేతగా రంగారెడ్డి, రన్నర్‌గా మహబూబ్‌నగర్ జట్లు
-రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత
-క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించుకోవాలి
-గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
-బహుమతులను అందజేసిన మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్

పెబ్బేరు : పెబ్బేరు పట్టణంలోని ప్రియదర్శిని జూరాల కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న అండర్-19 బాలుర ఫుట్‌బాల్ పోటీలు ఆదివారంతో ముగిసాయి. హోరాహోరీగా జరిగిన పోటీ ల్లో మొదటి బహుమతి రంగారెడ్డి జట్టు గెలుపొందగా, రెండో బహుమతి మహబూబ్‌నగర్ జట్టు కైవసం చేసుకున్నది. మూడో బహుమతిని హైదరాబాద్ జట్టు దక్కించుకున్నది. బహుమతుల ప్ర దానోత్సవానికి ముఖ్య అతిథిగా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44వ జా తీయ రహదారికి అతీ సమీపంలో అన్ని వసతి సౌ కర్యాలకు అనువుగా ఉన్న పెబ్బేరు ఆటలకు అ డ్డాగా మారాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యువ త క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. నేటి యువత క్రీడల్లో రాణించి రాష్ర్టానికి దేశంలోనే మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడలు వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేస్తాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ స్థిరత్వమే వ్యక్తిత్వ నిర్మాణానికి నిదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాపిరెడ్డి, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రామన్, హ న్మంతు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సుధీర్ కుమార్ రెడ్డి, పీఈటీలు తిరుపతయ్య, శ్రీనివాసులు, వెంకన్న, నిరంజన్ గౌడ్, నిర్వాహకులు, వివిధ జిల్లాల క్రీ డాకారులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...