వర్షానికి నేలకొరిగిన వరి పైరు


Mon,November 11, 2019 02:18 AM

తాడూరు : మండలంలో శుక్ర,శనివారాల్లో కురిసిన వర్షానికి మండలంలోని వివిధ గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట మొత్తం నేలకొరిగాయి. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వరిచేను కోతకు వచ్చే దశలో అకాల వర్షం పడడంతో వరి చేళ్లు మొత్తం వర్షానికి, గాలికి నేలమట్టమైనట్లు రైతులు తెలిపారు. వేల కొద్ది పెట్టుబడులు పెట్టి వరి పంట సాగు చేస్తే దురదృష్టవశాత్తు శుక్ర,శనివారాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని వరి పంటలు మొత్తం నేలకొరిగాయి. మండలంలోని ఎంగంపల్లి, గుట్టలపల్లి, పొల్మూరు, మేడిపూర్, ఆకునెల్లికుదురు, అంతారం, సిర్సవాడ, పాపగల్, గోవిందాయిపల్లి, ఐతోల్, అల్లాపూర్, తాడూరు గ్రామాల్లో వరిపంట మొత్తం నేలకొరిగింది. కొంత మంది రైతులు నేలకొరిగిన వరి పంటను కూలీలచే నీటిలోని వరిని కట్టలు కట్టిస్తున్నారు. ఇంకొంత మంది కూలీల కొరతతో ఏం చేయలేని పరిస్థితి వచ్చిందని, ఇంకా రెండు, మూడు రోజులైతే నేలకొరిగిన వరిపంట మొత్తం మొలకెత్తి పంటంతా నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.


49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...