కోల్డ్ స్టోరేజిని సద్వినియోగం చేసుకోవాలి


Mon,November 11, 2019 02:17 AM

- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
తాడూరు : మండలంలోని మల్కాపూర్ గేటు సమీపంలో ప్రారంభించిన కోల్డ్ స్టోరేజి ఏసి గోదాంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయా శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మల్కాపూర్ గేటు సమీపంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజి గోదాంను ఎంపీ రాములు, జెడ్పీచైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రూ.4కోట్ల నిధులతో ఆరు మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజి ఏసీ గోదాంను సత్యసాయి కోల్డ్ స్టోరేజి వారు ఏర్పాటు చేశారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ రోహిణి, మార్కెట్ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యార రమేశ్, నాయకులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...