రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక


Mon,November 11, 2019 02:17 AM

కల్వకుర్తి రూరల్ : మండలంలోని తోటపల్లి, గుండూరు, గ్రామాలలోని జెడ్పీ పాఠశాలల విద్యార్థులు అండర్-17 ఖోఖో రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాలల పీఈటీలు రమేశ్, జగన్, పురంచంద్‌లు ఆదివారం తెలిపారు. జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలబాలికల ఖోఖో టోర్నమెంట్‌లో తోటపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థి వంశీ, తాండ్ర జెడ్పీ పాఠశాల విద్యార్ధినీ శివలీల, గుండూరు జెడ్పీ పాఠశాల విద్యార్ధి ప్రసాద్‌లు చక్కటి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనారు. వీరు ఈనెల 13,14,15 వ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల వద్ద నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనున్నట్లు పీఈటీలు తెలిపారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎం కావడం పట్ల పాఠశాలల హెచ్‌ఎంలు, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులను అభినందించారు.

పెద్దాపూర్ ప్రభుత్వ
వెల్దండ: పరిధిలోని పెద్దాపూర్ ప్రభుత్వ ఉన్న పాఠశాల విద్యార్థిని లలిత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ మోహన్‌లాల్ తెలిపారు. పెద్దకొత్త పల్లి మండలంలో జరిగిన ఉమ్మడి పాలమూర్ జిల్లా ఎస్‌జీఎఫ్ ఖోఖో పోటీల్లో లలిత పాల్గొని ఉమ్మడి పాలమూర్ జిల్లా తరపున రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పీఈటీ తెలిపారు. నెల 13,14,15 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లలిత ను పాఠశాల హెచ్‌ఎం,పీఈటీ అధ్యాపకులు, స్థానికులు అభినందించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...