రాజారాంపై వంశీకృష్ణ టార్గెట్ చేయడం సిగ్గుచేటు


Mon,November 11, 2019 02:17 AM

అమ్రాబాద్ రూరల్: రైతు సమన్వయ సమితి మం అధ్యక్షుడు రాజారాంగౌడ్‌పై డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ వ్యక్తిగత దూషనలకు దిగుతే.. భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్న విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో అటవీశాఖ క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మన్ననూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనారోగ్యంతో ఉన్నందుకు పార్టీలకు అతీతంగా పరామర్శించి వెళ్తున్న క్రమంలో డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ రాజారాంగౌడ్‌ను పక్కకు తీసుకెళ్లి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజారాంగౌడ్‌పై వ్యక్తిగత దూషనలు చేయడం వల్లే ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, ఆవిషయంపై తానేమి మాట్లాడనన్నారు. తాటాకు చప్పుల్లకు భయపడేది లేదని.. ఏమాత్రం విచక్షణ లేని సంఘ విద్రోహ వ్యక్తులను వెంటబెట్టుకొని టీఆర్‌ఎస్ క్యాడర్‌పై దాడులు చేయడం, బెదిరింపులకు గురిచేయడం ప్రజాస్యామ్యం కాదన్నారు.

నేను ఎక్కడనుండో వచ్చానని కాదు.. నా రక్తం చివరి బొట్టు వరకు ఇక్కడి ప్రజలకు సేవచేస్తునే ఉంటానని, నీలా నీచ రాజకీయాలు చేయడం నా నైజం కాదని ఎమ్మెల్యే వంశీకృష్ణపై ఫైర్ అయ్యారు. అనంతరం రాజారాంగౌడ్ మాట్లాడుతూ నాకు చిన్న హాని తలపెట్టిన వంశీకృష్ణనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పార్టీ వేరైనా సహచరుడని మానవతా దృక్పథంతో పరామర్శించి వస్తున్న క్రమంలో భయపెట్టేలా మాట్లాడినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్ల్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పెర్ముల సర్పంచులు శ్రీరాంనాయక్, పెద్దిరాజు, మండల నాయకులు నీరంజన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యం, జహీర్, రవికుమార్, వెంకటేశ్, చంద్రమౌళి, తదితరులు ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...