మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట


Sun,November 10, 2019 01:16 AM

- బలపేతం చర్యలు
- జైపాల్‌యాదవ్
- చెందిన 17మంది మత్స్యకారులకు పంపిణీ

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ :తెలంగాణలో అన్ని కులవృత్తులకు చేయూతనిస్తున్న విధంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కూడా పెద్ద పీట కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సమీకృత మత్స్యకార అభివృధ్ధి సహకార సంఘం నుంచి కల్వకుర్తి మండలం తోటపల్లికి మత్స్యకార సహకార సంఘానికి చెందిన 17 మంది సభ్యులకు రాయితీపై మంజూరైన 17 మోపెడ్( ద్విచక్ర వాహనాలు)లను శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల వారిని బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం అనేక సంక్షే పథకాలను ప్రవేశ చెప్పా నియోజకవర్గంలో 17 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయని, అన్ని సంఘాలలో కలిసి 715 మంది మత్స్యకార సభ్యులు ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. సంవత్సరానికి గాను నియోజకవర్గంలో 41 చెరువు కుంటలలో రూ.8.20లక్షల చేప పిల్లలను వదిలామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చెప్పారు. అభివృద్ధి పథకంలో భాగంగా 178 మందికి మోపెడ్ వాహనాలు,7 మందికి లగేజ్ ఆటోలు, నలుగురికి సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ మహిపాల్, జెడ్పీటీసీ సభ్యురాలు విజితారెడ్డి, ఎంపీపీ సునిత, మాజీ చైర్మన్ శ్రీశైలం, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు విజయ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పక్షాల దుష్ప్రచారం మానుకోవాలి
వెల్దండ: గొప్ప ముఖ్యమంత్రిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్‌పై ప్రతి పక్షాలు దుష్ప్రచారం మానుకోవాలని జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం వెల్దండలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మీడియాతో సమ్మెను అడ్డం పెట్టుకొని ప్రతి పక్షపార్టీల నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పథకాలు చారిత్రత్మక నిర్ణయాలన్నారు. గత సీమాంద్రుల పాలనలో తెలంగాణ బడ్జెట్‌ను ఆంధ్ర ,రాయలసీమాకు దారి మళ్లించి తెలంగాణకు అన్యాయం చేస్తే ఏ ఒక్కరు మాట్లాడినపాపానపోలేదన్నారు. రూ. లక్ష కోట్లతో రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకంలో 2022 నాటికి కల్వకుర్తిలో ప్రతి గుంటకు సాగునీరందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, యూత్ అధ్యక్షుడు రవిగౌడ్, ఇన్‌చార్జి సర్పంచ్ నిరంజన్, లక్ష్మణ్‌నాయక్, మా ఎంపీపీ జయప్రకాశ్ ,నాయకులు జై రాజశేఖర్, వెంకటేశ్, లక్ష్మ వీరారెడ్డి, బాల రాము, సమీర్‌బాబా, గజినిశ్రీను,ప్రవీణ్, సర్ధార్ ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రాజునాయక్ తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...