విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి


Sun,November 10, 2019 01:14 AM

పెద్దకొత్తపల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎంపిక కావాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ 65వ ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన అండర్-17 బాలికల విభాగం మొదటి విజేత నారాయణపేట, ద్వితీయ విజేత వనపర్తి, అండర్-17 బాలుర విభాగంలో మొదటి విజేత నాగర్‌కర్నూల్, ద్వితీయ విజేత మహబూబ్‌నగర్ నిలిచాయి. అదే విధంగా ఉమ్మడి పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికలు 15 మంది బాలురు 14 మంది ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు అశోక్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రేణుకానాగరాజు, ఎంపీటీసీ శశికళ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రాజశేఖర్, నాగరాజు, వెంకటయ్య, చంద్రయ్య, కొండల్‌రావ్, తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్,
జిల్లా ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక
నాగర్‌కర్నూల్ టౌన్: ఎస్‌జీఎఫ్ 65వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్, నాగర్‌కర్నూల్ జిల్లా ఖోఖో పోటీలకు నాగర్‌కర్నూల్ లిటిల్‌ఫ్లవర్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తిలో అండర్-17 బాలబాలికల ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ఖోఖో పోటీలకు 9వ తరగతి చదువుతున్న రాఘవేందర్, జిల్లాస్థాయిలో అండర్-17 బాలికల విభాగంలో ఖోఖోకు 9వ తరగతి చదువుతున్న నవ్య ఎంపికయ్యారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, కోచ్ రామన్‌గౌడ్, పీఈటీ వీరప్పలు వారిని అభినందించారు.

కొల్లాపూర్ గాంధీ
కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: 65వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి అండర్ 14 ఖోఖో పోటీల పాల్గొ కొల్లాపూర్ గాంధీ హై విద్యార్థులు ఉమ్మ జిల్లా ఖోఖో పోటీలకు ఎంపిక ఈ ఎంపికైన విద్యార్థులలో బాలరాజు, వెంకటేశ్‌లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పునవర్ సుల్తానా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నరసింహారెడ్డి, పీఈటీ ఉపేందర్‌రెడ్డి ఉపాధ్యాయులు

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...