యథావిధిగా బస్సు ప్రయాణం


Sat,November 9, 2019 05:16 AM

-2 ఆర్టీసీ, 21 అద్దె బస్సులు నడిపిన ఆర్టీసీ యాజమాన్యం
వనపర్తి టౌన్ : ఆర్టీసీ సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం 35వ రోజు ఆర్టీసీ యాజమాన్యం బస్సులను యథావిధిగా బస్సు ప్రయాణం కొనసాగించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రూట్లలో బస్సులను నడుపుతుంది. మొత్తం 93 బస్సులకు గానూ 72 ఆర్టీసీ, 21 అద్దె బస్సులను నడిపింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు సాఫీగా సాగించేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా గురువారం ఒక్కరోజే రూ.9,71,472 ఆదాయాన్ని ఆర్టీసీ గడించినట్లు డీఎం దేవదానం తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బస్టాండ్, డిపో, రాజీవ్ చౌరస్తాలో సీఐ సూర్యనాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...