12 నుంచి గాంధీ సంకల్ప యాత్ర


Sat,November 9, 2019 05:14 AM

-బీజేపీ రాష్ట్ర నాయకురాలు బంగారు శృతి
వనపర్తి వైద్యం : ఈనెల 12 నుంచి 24వ తేది వరకు మహత్మాగాంధీ 150వ జయంతిని పురష్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకురాలు బంగారు శృతి అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 12వ తేదిన పెబ్బేర్ మండలం, 13న వనపర్తి, 16న నాగర్‌కర్నూల్, 17న అచ్చంపేట, 18న కొల్లాపూర్, 19, 20, 21, 22 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా, 23న కల్వకుర్తి, 24న ఆమనగల్లులో నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రావు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, కృష్ణ, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బుడన్న, వెంకటేశ్వర్‌రెడ్డి, కుమారస్వామి, మురార్జీ నాయక్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...