కేంద్ర విధానాల వల్లే ఆర్థిక సంక్షోభంఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి


Sat,November 9, 2019 05:13 AM

వనపర్తి టౌన్ : కేంద్ర అనాలోచిత విధానాల వల్లే దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా చేపడుతున్న కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసి మరింత పెద్దనోట్లను అందుబాటులోకి తెచ్చి అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. చిన్నతరహా పరిశ్రమలన్నీ దివాలా తీశాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉదాసీనతతో కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శ్రీరంగాపురం జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ప్స్రాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, కిరణ్‌కుమార్, రాగివేణు, సురేష్, చీర్ల జనార్దన్, ఎండీ బాబా, రాధాకృష్ణ, సత్యారెడ్డి తదితరులు ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...