ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి


Sat,November 9, 2019 05:13 AM

వనపర్తి టౌన్ : మహా కాలజ్ఞాని వీరభ్రహ్మేంద్రస్వామి 411వ జయంతిని జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టీజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని తన కాలజ్ఞానం ద్వారా బోధించి జాతిని జాగృతపరిచే రాజయోగి పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి అని, మానవ జన్మ రహాస్యాన్ని బోధించిన మహాజ్ఞాని అని చెప్పారు. సకల జాతులు సావదానం గురించి వేద నిష్ణాతులైన శిష్య గణంతో ఆత్మతత్వాన్ని, యోగ మార్గాన్ని, దైవత్వాన్ని శిష్యులకు ఉపదేశించారన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు రాజరాం ప్రకాశ్, ఖాదర్‌ఫాషా, సూర్యనారాయణాచారి, గిరిరాజాచారి, తిరుపతయ్యచారి, శ్రీవర్ధన్‌రెడ్డి, చెన్నరాములు, సంజీవయ్య, గోపిగౌడ్, మూర్తి, చలపతిరెడ్డి, ఏఎం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...