మహిళలకు చేయూతనివ్వాలి


Fri,November 8, 2019 04:00 AM


-మానసిక, శారీరక దాడులకు గురైన మహిళలకు అండగా ఉండాలి
-సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ శ్రీధర్
-గృహహింస రక్షణ చట్టం పోస్టర్ విడుదల

నాగర్‌కర్నూల్ టౌన్: ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నిషేధించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లాలో ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్లు కాలుస్తూ కనిపిస్తుంటారని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు ఉత్పత్తిలో నికోటిన్ అనే విషతుల్యమైన పదార్థం ఉంటుందని, పొగతాగేవారి గురించే కాకుండా వారి పరిసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిగరేట్ అండ్ అదర్ టోబాకో ప్రొడక్ట్(సీవోటీపీ) చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని అడ్డుకోవడానికి యాంటి టోబాకోసెల్ జిల్లా ఉన్నతస్థాయి కమిటీ మొదటి సమావేశం కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పాఠశాలల, కళాశాలల ఆవరణల్లో పొగతాగే వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీ సభ్యులను ఆదేశించారు.సమావేశంలో అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులు, పాల్గొన్నారు.

మహిళలకు చేయూతనివ్వాలి
నాగర్‌కర్నూల్ టౌన్: మానసిక, శారీరక దాడులకు గురైన బాలికలు, గృహహింస బాధిత మహిళలకు సఖి కేంద్రం చేయూతనివ్వాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంతబజార్‌లో కొనసాగుతున్న సఖి కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా కేంద్రంలో బాధిత మహిళలకు, న్యాయ సేవలు, కౌన్సిలింగ్ సేవలు, వైద్య సేవలు, తాత్కాళిక వసతి, పోలీస్ సేవలు, అత్యవసర సమయంలో వచ్చిన బాధిత మహిళలకు కనీస అవసరాలైన దుస్తులు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం సఖి కేంద్రంలోని సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించి ప్రశంసించారు. ఈ కేంద్రం ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. సఖి కేంద్రం నిర్వాహకులు టీమ్‌వర్క్ చేయాలని సూచించారు. గృహ నుంచి మహిళలకు రక్షణ చట్టం 2005 పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి ప్రజ్వల, ఎస్‌వీకే లక్ష్మణ్‌రావు, వివేకానంద యువజన సం అధ్యక్షుడు రామకృష్ణ,తదితరులున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...