రైతుల ఆదాయాన్ని రెండింతలు అయ్యేలా చూడాలి


Fri,November 8, 2019 03:59 AM

నాగర్‌కర్నూల్ టౌన్: రైతులకు రెండింతల ఆదాయం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని కేవీకే డైరెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి రైతు ఉత్పత్తుదారుల సంఘాలకు సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా నా ఏజీఎం హమిత్‌భార్గవ్ సమావేశానికి ఇందిరా ప్రియదర్శిని మహిళా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం రెండింతలు చేయాలని, దానికై మనం పెట్టుబడిని తగ్గించి పంట దిగుబడిని పెంచాలని సూచించారు. నాగర్‌కర్నూల్ లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ రైతు ఉత్పత్తి దారుల సంఘాలు బ్యాంకుల యొక్క సహకారం గూర్చి వివరించారు. సమావేశంలో ఇందిరా ప్రియదర్శిని సీఈవో గోవర్ధని మాట్లాడుతూ అన్ని ఎన్‌జీవోలు ఏర్పాటు చేసి ఎఫ్పీవోకు నాబార్డు, బ్యాంకులు ఆర్థిక సహాకారం అందించాలని సూచించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...