స్వేరోస్


Fri,November 8, 2019 03:58 AM

అచ్చంపేట రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ బడిలో చేరిన రోజు (నవంబర్ 7) కావడంతో స్వేరోస్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి నడింపల్లి వై చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. 2కే రన్ ను మున్సిపల్ చైర్మన్ తులసీరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. రన్‌లో పాల్గొన్న విద్యార్థులలో గురుకుల పాఠశాలకు చెందిన రమేశ్‌కు ప్రథమ, నడింపల్లికి చెందిన మహేశ్‌కు ద్వితీయ, బాలికల గురుకుల పాఠశాల విధ్యార్థిని రాణికి తృతీయ బహుమతులను అందజేశారు. 2కే రన్‌కు సహకరించిన వ్యక్తుల ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్వేరోస్ నెట్‌వ డివిజన్ అధ్యక్షుడు (కార్డియాలజిస్ట్) డాక్టర్ శంకర్, జెడ్పీటీసీ మత్య్రానాయక్, నాయకులు చంద్రమౌళి, రాజేందర్, మహేశ్, రాజు, గణేశ్ తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...