3గంటలు..22 కి.మీ..


Thu,November 7, 2019 01:01 AM

-అచ్చంపేట టు లింగాల.. వయా బల్మూరు
-మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న విప్ గువ్వల బాలరాజు
-యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని పిలుపు

లింగాల/బల్మూరు : అచ్చంపేట మండల కేంద్రం నుంచి లింగాల మండల కేంద్రం వరకు 22కి.మీ దూరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మార్నింగ్ వాక్ చేశారు. బుధవారం తెల్లవారు జామున 5.15 గంటలకు అచ్చంపేట నుంచి బయలు దేరి బల్మూరు మీదుగా లింగాలకు ఉదయం 8:30 గంటలకు చేరుకున్నారు. బల్మూరు మం డలంలోని రాంనగర్ తండా, సీతరాంపూర్, కొండనాగుల, బల్మూరు, అనంతవరం, నర్సాయపల్లి గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతదూరం గువ్వలతోపాటు రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ ద్యానం, వ్యాయామం మానసిక, శారీరానికి ధృడత్వానికి ఎంతో అవసరమన్నారు. యు వత సన్మార్గంలో పయనించి అనుకున్న ల క్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, మాజీ జడ్పీటీసీ మాకం తిరుపతయ్య, ఎంపీటీసీ కేటీ తిరుపతయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రానోజీ, మండల పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు హన్మంతు, వెంకట్‌గిరి, మల్లయ్యమాధవులుగౌడ్, ప్రేమ్‌కుమార్, శివకుమార్, శివశంకర్, తిరుపతయ్య, రాములు, సహదేవు తదితరులు ఉన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...