కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా


Thu,November 7, 2019 12:58 AM

బల్మూరు : కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ సంఘటన మండల కేంద్రమైన బల్మూరు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బల్మూరు గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు మండలంలోని మైలారం శివారులో పత్తి తీసేందుకు ఆటోలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు 108కు ఫోన్ చేసి బాధితులను అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందులో రాములమ్మ, అనితల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. మిగతా నలుగురు గాయాలతో అచ్చంపేట దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆటో మైలారం గ్రామానికి చెందిన పల్లి మల్లయ్యదిగా గుర్తించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...