శ్రీగిరిలో ప్రత్యేక పూజలు


Wed,November 6, 2019 02:02 AM

శ్రీశైలం : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం ప్రత్యేక పూజాధికాలను సర్కారీ సేవలుగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం,షష్టి,కృత్తిక నక్షత్రం రోజులల్లో ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. దీనివలన శత్రుబాధలు, గ్రహపీడలతోపాటు దృష్టి లోపాలు దూరమోతాయని ప్రధాన అర్చకులు పీఠం మల్లయ్య తెలిపారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన జి.మోహన్‌ రావు మేరు రూ .5,00,000 (ఐదు లక్షల రూపాయలు) విరాళంగా మంగళవారం ఉదయం ఆలయ అధిరాకారి వెంకటేశ్వరావుకు విరాళాన్ని అందించారు. నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌కు చెందిన కే శ్రీనివాస్‌ రెడ్డి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles