నాగర్‌కర్నూల్‌టౌన్: గత రెండు రోజులుగా జిల్లాలో ప్రయాణికుల రద్ది పెరగడంతో అందుకు అనుగుణంగా బస్సులను నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఓ వైపు కురుమూర్తి జాతరకు భక్తుల రద్ధీ పెరగడంతో బస్టాండ్ ప్రాంగణం కిటకిటలాడుతుంది. మంగళవారం భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ, ప్రైవేట్, ఇతర జీపులు, ఆటోలు కలిపి 852 వాహనాలు జిల్లాలో నడవగా దాదాపు లక్షా 25వేల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారు. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 143 ఆర్టీసీ బస్సులు, 74 హైర్ బస్సులు, 245 ట్యాక్సి వాహనాలు, ఏడు టూరిస్ట్‌లు నడిపించారు.