కస్తూర్బాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి


Tue,November 5, 2019 12:47 AM

నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లాల్లోని కస్తూర్బా పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సమగ్ర శిక్ష అభియాన్ పథక సంచాలకులు, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ఆదేశించారు. డీఈవో కార్యాలయంలో సోమవారం కస్తూర్బాల ప్రత్యేకాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లోని ప్రతివిద్యార్థి ఆరోగ్యం, విద్య, భోజన వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన రోజువారి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని కేజీబీవీ విద్యార్థినులకు అందించాలన్నారు. ప్రతి పాఠ్యాంశంలో విద్యార్థికి మెరుగైన మార్కులు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అనుగుణంగా బోధన చేయాలన్నారు.

పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు జిల్లా పరీక్షల విభాగం నుంచి రూపొందించిన ప్రణాళిక ప్రకారం నేటి నుంచి వంద రోజుల వరకు అన్నిసబ్జెక్ట్‌ల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆంగ్ల, గణిత, సా మాన్య సబ్జెక్ట్‌ల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆంగ్ల, గణిత, సా మాన్య సబ్జెక్ట్‌ల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ ఫలితాలతోపాటు విద్యార్థులను అన్నిరంగాల్లో చక్కగా తయారుచేసి కస్తూర్భాలో చదివే అమ్మాయిలకు ఉజ్వల భవిష్యత్ అందించేలా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో కార్యాలయ సహాయ సంచాలకు లు అశోక్, గణాంక అధికారి ఈశ్వరప్ప, సెక్టోరల్ అధికారులు యశోదారెడ్డి, అహ్మద్, గంగాధర్, 20 కేజీబీవీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...