పునాదిపై అవగాహన ఉండాలి


Tue,November 5, 2019 12:47 AM

అమ్రాబాద్ రూరల్: విద్యాపరంగా వెనకబడిన గిరిజన విద్యార్థులపై మరింత విద్యాప్రమాణాలు తీసుకో చ్చేందుకు ఐటీడీఏ పరిధిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో (జీపీఎస్)లో వేల రూపాయాలు వెచ్చించి మౌ ళిక వసతులు కల్పించిందని ఐటీడీఏ పీవో డాక్టర్ వెం కటయ్య అన్నారు. సోమవారం ఐటీడీఏ పరిధిలో నా గర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లా ల్లో జీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులకు పూనాది కార్యక్రమం ఎలా చేపట్టాలో పీవో, పీఎంఆర్‌సీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గ తేడాది పూనాది-1 కార్యక్రమం అన్ని పాఠశాలల్లో ని ర్వహించామని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పూనాది కార్యక్రమంపై ఉపా ధ్యాయులకు అవగాహన ఉండాలని అన్నారు. బల్మూ రు మండలానికి చెందిన ఒక ఉపాధ్యాయురా లు పు నాది-1 కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లక్షరాలను గుర్తించడం, కూడీకలు, తీసీవేతలు ఆంగ్ల వర్ణమాల, ఆంగ్ల పదాలు రాయడం లాం టివి ప్రతి పిల్లవాడికి వచ్చేలా చేయడమే పూనా ది-1 యొక్క ఉద్ధేశమన్నారు. సర్వే ప్రకారం విద్యార్థుల తరగతులకు అనుగుణంగా విద్యాప్రమాణాలు ఆ సించిన స్థాయిలో ఉండటం లేదనేది అర్థమవుతుందన్నారు. దీనికి కారణం విద్యార్థులు నేర్చుకోవడానికి ఇష్టపడ టం లేదా, లేక పాఠశాలకు గైర్హాజరవుతున్నా రా? అనేది మీ పైనే ఉందని తెలిపారు.

సమయపాలన పాటించడం లేదనేది ఆయా గ్రామాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని, ఇకనుంచి సమయపాలన పాటించకపోయిన, మండల విద్యాధికారికి సమాచారం లేకుండా గైర్హాజరైన చర్యలు తప్పవన్నారు. పూనాది-2 కార్యక్రమాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయరాదని, ఉన్నతాధికారుల ఆస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జీపీఎస్ పాఠశాల వి ద్యార్థులకు ప్రభుత్వం అందించే రెండు జతలకు బదులుగా ఒకేజత దుస్తులు అందజేశారని పీవో దృష్టికి ఉ పాధ్యాయులు తీసుకొచ్చారు. సంబంధిత ఎంఈవో తో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు. పూనాది-2 పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులకు పీవో అందజేసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్ర మం లో ఏసీఎంవో అధికారి శంకర్, పీఎఆర్‌సీ అధికారి మల్లేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...