వందశాతం లక్ష్యాన్ని సాధించాలి


Tue,November 5, 2019 12:46 AM

-ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్
బిజినేపల్లి: కేసీఆర్ కిట్టు నమోదులో వందశాతం లక్ష్యాన్ని సాధించాలని, గర్భిణి నమోదు నుంచి ప్రసవమయ్యే వరకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్ అన్నా రు. సోమవారం మండలంలోని పాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షణాధికారులతో జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైరిస్క్‌గా గుర్తించిన గర్భిణులను ముందుగానే గుర్తించిన దవాఖానకు తరలించి సుఖ ప్రసవాలు చేయించేలా చూడాలన్నారు. 102 వాహనాలను ఉపయోగించుకోవాలని, ప్రభత్వాదవా ఖానల్లోనే కాన్పులు పెంచాలని సూచించారు. ఈ ఔషది నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి వెంకటదాసు, మోహనయ్య, శ్రీకాంత్, వైద్యాధికారులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...