ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగిస్తే చర్యలు


Wed,October 23, 2019 02:22 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ శానిటేషన్‌ అధికారి శివ హెచ్చరించారు. మం గళవారం కల్వకుర్తి పట్టణంలోని హోటళ్లలో ప్లాస్టిక్‌కవర్లకోసం సోదాలు నిర్వహించారు. రెండు హోటళ్లలో ప్లాస్టిక్‌కవర్ల వినియోగాన్ని గుర్తించిన మున్సిపల్‌ సిబ్బంది సదరు హోటళ్ల నిర్వాహకులకు రూ.500చొప్పున జరిమానా విధించారు. మరోసారి ప్లాస్టిక్‌ కవర్లు లభిస్తే జరిమానా ఎక్కువ విధించడమే కాకుండా, ఇతర చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ అధికా రులు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ రహిత కల్వకుర్తి కొరకు అందరం కృషిచేయాల్సిన అవసరం ఉందని, దీనికి అంద రూ సహకరించాలని మున్సిపల్‌ సిబ్బంది సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నా రు. ప్లాస్టిక్‌ కవర్లును ఉపయోగించొద్దని, ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగంలోకి తెచ్చు కోవాలని మున్సిపల్‌ సిబ్బంది పిలుపునిచ్చారు. కిరాణ, హోటళ్లు, మాంసం దుకాణాల వారు ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించొద్దని, లేని పక్షంలో భారీ జరిమానాలు తప్పవని మున్సిపల్‌ సిబ్బంది హెచ్చరించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...