డిక్షనరీ మాసం నిర్వహించాలి


Wed,October 23, 2019 02:21 AM

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: విద్యాలయాల్లో డిక్షనరీ మాసాన్ని విధిగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో హైదరాబాద్‌ నుంచి పాఠశాలల విద్యాశాఖ సంచాలకులు విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు(సీఎస్‌ఎఫ్‌) సెంటర్‌ ఫర్‌ ఫౌండేషన్‌తో నాలుగు సంవత్సరాలపాటు తెలంగాణ ప్రభు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. సీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎన్నుకొని ఆ మండలంలోని పాఠశాలల, విద్యార్థుల స్థితిగతులపై అధ్యాయనం నిర్వహిస్తారని తెలిపారు. విద్యా ప్రమాణాలను మెరు పరిచేందుకు ఉపాధ్యాయులతో కలి కావాల్సిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఫౌండేషన్‌ సభ్యులు జిల్లాలను సందర్శించినప్పుడు వారికి మండలాలను కేటాయించే బాధ్యత డీఈవోలు గుర్తించాలని డీఈవోలను ఆదేశించా ప్రతి విద్యార్థి ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించేందుకు విద్యార్థులందరికీ డిక్షనరీలు అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ‘డిక్షనరీ మాసం’ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలు నిర్వహించాలన్నారు. దాతల సహకారంతో ప్రతి విద్యార్థికి డిక్షనరీ అందించేందుకు డీఈవోలు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, మొదట వినడం ముఖ్యమని, ప్రతి ఉపాధ్యాయుడు వినడం అవలంభించుకోవాలని సూచించారు. వారంలో ఒక రోజు ఒక విద్యార్థి ఇంటిని ఉపాధ్యాయుడు సందర్శించి వారి తల్లిదండ్రులతో విద్యార్థి చదువుపట్ల ఉన్న శ్రద్ధపై ఇతర అలవాట్ల గురించి చర్చించాలన్నారు.

బద్ధంగా బోధనా తరగతులు జరిగేలా చర్యలు తీసుకవాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు, డీఈవోలు ప్రతిరోజు ప్రార్థనకు పాఠశాలల్లో హాజరు కావాలని విద్యార్థుల నిష్పత్తికి ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండేలా డీఈవోలే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని 100 శాతం ఉం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈ గోవిందరాజులు, ఏడి అశోక్‌, న్డోల్‌ అధికారి కుర్మయ్య, సెక్టోరల్‌ అధికారు అహ్మద్‌, నారాయణ, మండల విద్యాధికారులు రామ్‌గోపాల్‌, రామారావు, బాసునాయక్‌, శంకర్‌, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాల్‌జంగయ్య, బాలకిషన్‌ చంద్రుడు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు, లతా, తిరుపతయ్య, ప్రకాష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...