ఇసుక ట్రాక్టర్లు, లారీలు పట్టివేత


Mon,October 21, 2019 01:34 AM

నవాబ్‌పేట : మండల పరిధిలోని ఫతేపూర్ గేట్ వద్ద ఇక్రమంగా ఫిల్టర్ ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఫతేపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో రుద్రారం గ్రామం వైపు తరలిస్తుండగా వలపన్ని ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ట్రాక్టర్లతో పాటు ట్రాక్టర్ల యజమాని శేఖర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

రెండు ఇసుక లారీలు ..
రాజాపూర్ : మండం కేంద్రంతో పాటు మండల పరిధిలోని తిర్మలాపూర్, చెన్నవెల్లి, రాయపల్లి, గుండ్లపోట్లపల్లి తదితర గ్రామాల వాగు నుంచి మట్టిని తవ్వి ఫిల్లర్ చేసి ఇసుక మాఫియా అర్ధరాత్రి లారీలతో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తుండగా శనివారం రాత్రి స్పెషల్ పార్టీ, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. తిర్మలాపూర్ నుంచి రాఘపూర్, బాలానగర్ మీదుగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పాటు రాజాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల అవరణ సమీపంలో అక్రమంగా డంపు చేసిన ఇసుకను లారీలో తరలిచేందుకు సిద్ధమయ్యారన్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ఇసుక లారీని, ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించా మని ఏఎస్సై యాదయ్య తెలిపారు. అలాగే డంపు చేసిన ఇసుకను సీజ్ చేసి తాసిల్దార్‌కు అప్పగించినట్లు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...