విద్యుత్ షాక్‌తో ఏడు గొర్రెలు మృతి


Mon,October 21, 2019 01:34 AM

వీపనగండ్ల : మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులకు సంబంధించిన ఏడు గొర్రెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తూం కుంట, బొల్లారం గ్రామాల శివారులో గల అమ్మ చెరువు సమీపంలోని భీమా కాలువ నుంచి బొల్లారం గ్రామానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు. రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దిమ్మె స్థానంలో ట్రాక్టర్ వీల్స్ ఉపయోగించి ట్రాన్స్‌ఫార్మర్ వినియోగించుకునేవారు. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ట్రాన్స్‌పారం సమీపంలో వెళ్లుచున్న గొర్రెలు విద్యుత్ షాక్ కు గురై ఆకస్మికంగా చనిపోయాయని కాపరులు తెలిపారు. తూంకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మ్యాకల వెంకటయ్యకు చెందిన ఐదు గొర్రెలు, మధుగని వెంకటయ్యకు చెందిన 2 గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని గొర్రెల కాపరులకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...