జాతీయ అవార్డు అందుకున్న అమరేందర్‌రెడ్డి


Mon,October 21, 2019 01:33 AM

బిజినేపల్లి : మండలంలోని మహదేవునిపేట గ్రామానికి చెందిన అమరేందర్‌రెడ్డి గత శనివారం జాతీయ అవార్డు అందుకున్నారు. భారతదేశ మాజీ, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం పరిశోధన సంస్థ జాతీయ స్థాయిలో ఈ అవార్డును అందుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన అమరేందర్‌రెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారు. అంతర్జాతీయ పరిశోధన ఆన్‌లైన్ గేమ్స్‌తో భారతదేశ యువతపై ప్రభావం, ఫైబర్ చట్టాల్లో లోపాలు, వ్యవసాయ రంగం, ప్రత్యేక నియంత్రణ, న్యాయ సూచన వంటి రచనలు రాయడం జరిగింది. ఇందుకు గాను జాతీయ స్థాయి పరిశోధన సంస్థ ఏపీజే అబ్దుల్‌కలాం పేరుపై అందజేసిన అవార్డుకు ఎంపికై అందుకున్నారు. ఈ అవార్డును ఈ నెల 19న గోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో అందుకున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...