అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములవ్వాలి


Mon,October 21, 2019 01:33 AM

అచ్చంపేట రూరల్: అంబేద్కర్ ఆశయ సాధనలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. ఆదివారం మండల పరిధిలోని నడింపల్లి గ్రామం పశు వైద్యశాల ముందు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్న డా.బీఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని గుర్తు చేశారు. నడింపల్లిలో విగ్రహం ఏర్పాటుకు గ్రామంలోని యువకులంతా ఏకమై విగ్రహ ఏర్పాటుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా హాజీపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అద్భుతంగా ఉండేలా కృషి చేయనున్నట్లు భరోసానిచ్చారు. నడింపల్లి, హాజీపూర్ విగ్రహ ఏర్పాట్లలో తమ వంతు సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. విప్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన గువ్వల బాలరాజును గ్రామ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శాంతాలోక్యానాయక్, పదర జెడ్పీటీసీ రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, పాల కేంద్రం చైర్మన్ సీఎం రెడ్డి, నాయకులు నర్సింహ్మగౌడ్, రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నాగరాజు, గ్రామ యువకులు గిరి, అజయ్‌కుమార్, మల్లేశ్, వినోద్, సుధాకర్, సురేశ్‌యాదవ్ తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...