అమరుల త్యాగాలు మరువలేనివి


Mon,October 21, 2019 01:33 AM

-నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం ఆక్టోబర్ 21వ తేదీన వేడుకలు జరుపుకుంటారు. ఇందుకోసం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేపట్టారు. పరేడ్‌లో ప్రత్యేకంగా స్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించనున్నారు. ఇందుకు పరేడ్‌ను ముస్తాబు చేశారు. అమరులను స్మరించుకుంటూ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జిల్లాలోఅమరులైన 24 మంది పోలీసుల కుటుంబాలను కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో సన్మానించనున్నారు.

అమరుల జ్ఞాపకాలు స్మరించుకుంటూ...
పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వివిధ రకాల పోటీలను నిర్వహించారు. జిల్లా ఏర్పడిన తర్వాత పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం మూడోసారి కావడంతో ఈసారి విదార్థులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించారు. నేనే పోలీస్ అయితే అనే అశంపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఇంకా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా 381 యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లెడ్ క్యాంప్‌కు తరలించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించనున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...